ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 8 విమానాశ్రయాలు మూసివేత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
ఇండోనేసియాలోని సుందా జలసంధిలో అనక్ క్రాకటా అగ్నిపర్వతం భారీగా బద్దలైంది. దట్టమైన బూడిద వెలువడుతుండటంతో అధికారులు దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను మూసివేశారు. దీనివల్ల 1.7 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1,500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అగ్నిపర్వతం చుట్టూ 3 కిలోమీటర్ల మేర నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు.