ఉద్యోగుల సమ్మెతో ఉలిక్కిపడ్డ పంజాబ్: విధులకు దూరంగా లక్షలాది మంది సిబ్బంది

రిపోర్టర్: అశోక్ స్థలం: చండీగఢ్

డిమాండ్లను పరిష్కరించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందంటూ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండు రోజుల సామూహిక సాధారణ సెలవు బాట పట్టారని జేఏసీ నాయకులు వెల్లడించారు. అక్టోబర్ 21, 22 తేదీల్లో జరిగే ఈ నిరసనతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. 18 శాతం డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.