ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలి శిశువు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: Adilabad
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.