యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల దరఖాస్తు ఫీజు రీఫండ్‌ ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాలకు సంబంధించి 2023 నోటిఫికేషన్ అభ్యర్థుల దరఖాస్తు రుసుం రీఫండ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియలో భాగంగా, ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ విండోను అందుబాటులోకి తెచ్చారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20లోగా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ వెల్లడించింది.