నెట్ఫ్లిక్స్ చేతికి నాని ప్యారడైజ్ మూవీ ఓటీటీ హక్కులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ది ప్యారడైజ్' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత, అంటే అక్టోబర్ మూడో వారం లేదా ఆ తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.