తెలుగమ్మాయి జీవాంజి దీప్తి సంచలనం: జపాన్ వేదికగా పసిడి పతకం కైవసం

రిపోర్టర్: నరేష్ స్థలం: వరంగల్

తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి జపాన్ వేదికగా జరిగిన పోటీల్లో స్వర్ణ పతకం సాధించి దేశం గర్వించేలా చేశారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. పేదరికం, అవమానాలను ఎదుర్కొంటూ అథ్లెటిక్స్లో అడుగుపెట్టిన ఈ అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పారిస్ పారాలింపిక్స్లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించిన దీప్తి, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచ స్థాయిలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగురవేశారు.