తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్న బీఆర్ఎస్ నేత బాసు హనుమంతు నాయుడు

రిపోర్టర్: కృష్ణ స్థలం: జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లాలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా, గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులతో కలిసి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు రిజర్వేషన్లు పెంపుతో పాటు తండాల అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.