బ్యాటింగ్ వైఫల్యమే మా కొంపముంచింది: అఫ్గాన్ కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ అన్నారు. పిచ్ బాగున్నప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయామని తెలిపారు. వరుసగా వికెట్లు కోల్పోవడం, తన రనౌట్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాయన్నారు. భారత బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతంగా రాణించి తమపై తీవ్ర ఒత్తిడి పెంచారని ఆయన పేర్కొన్నారు.