వేడుకల్లో ఉత్సాహం నింపిన జనసేన నాయకుల ఆప్యాయ పలకరింపులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వెదురుకుప్పం

గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం అగ్గిచెనుపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ యువనాయకులు నూతన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు నూతన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎన్ఆర్ చందు మాట్లాడుతూ నూతన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ సమాజ సేవలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.