మైత్రీ మూవీమేకర్స్ '418' సినిమా ట్రైలర్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ తొలిసారిగా హారర్‌ జానర్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘418’. అగ్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 15 ఏండ్లుగా మూసి ఉన్న బిల్డింగ్, రూమ్‌ నంబర్‌ 418లోని భయంకరమైన రహస్యంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.