పెద్ద వాల్గోట్ మాక్స్ఫోర్ట్ పాఠశాల ఉపాధ్యాయురాలికి ఉత్తమ అవార్డు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలోని మాక్స్ఫోర్ట్ పాఠశాల ఉపాధ్యాయురాలు గడ్డల గంగామణి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముజీబ్ అధికారికంగా వెల్లడించారు.

విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, పాఠశాల అభివృద్ధిలో ఆమె చూపిస్తున్న చొరవను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. గంగామణిని పాఠశాల యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.