సచివాలయ ఉద్యోగులకు కనీస వసతులు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కావలి
కావలి ప్రాంతంలోని సిరిపురం గ్రామ సచివాలయంలో కనీస వసతులు లేక ఉద్యోగులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహిళా ఉద్యోగులు ఉన్నప్పటికీ కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.