వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ బొత్స అనూష
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినందుకు ఆమె జగన్కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అనూషను జగన్ కోరారు.