ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భారీగా భక్తుల తాకిడి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ఆదివారం ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామని, ప్రయాణికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.