మంత్రి లోకేష్తో భేటీ.. రాష్ట్ర ప్రగతిపై చర్చ

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను తిరుపతి పర్యటనలో డాక్టర్ బడి సుధాయాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల గురించి వారు చర్చించుకున్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని సుధాయాదవ్ పేర్కొన్నారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఆయన నాయకత్వం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.