హుంకార వెబ్ సిరీస్ షూటింగ్లో మృత్యువుతో పోరాడానన్న రఘుబీర్ యాదవ్

రిపోర్టర్: నరేష్ స్థలం: Mumbai

హుంకార: ది రోర్ వెబ్ సిరీస్లో దేవుడి పేరుతో మోసం చేసే బాబా పాత్ర పోషించడం తనకు తీవ్ర మానసిక, శారీరక వేదనను మిగిల్చిందని ప్రముఖ నటుడు రఘుబీర్ యాదవ్ వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రతి రోజూ మృత్యువుతో పోరాడినంత పని అయిందని, తన గుండె స్పందన కూడా పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన ఈ పాత్ర నుండి బయటపడేందుకు తాను ఎంతో కష్టపడ్డానని ఆయన తెలిపారు.