ஒరంగుటాన్ పిల్లలకు భువనేశ్వర్ జూలో మ్యూజిక్ థెరపీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఒడిశా

ఒడిశాలోని భువనేశ్వర్ నందన్‌కానన్ జూలో అక్రమ రవాణాలో పట్టుబడిన ఐదు ఒరంగుటాన్ పిల్లలకు అధికారులు మ్యూజిక్ థెరపీ అందిస్తున్నారు. తల్లుల నుంచి వేరుపడి తీవ్ర ఒత్తిడికి గురైన ఈ అరుదైన జీవులకు శాస్త్రీయ సంగీతం వినిపిస్తూ సాంత్వన చేకూరుస్తున్నారు. బొమ్మలు, ఊయలలు ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణలో వాటిని సంరక్షిస్తున్నారు.