పాలకొల్లులో అభివృద్ధి పనులు: నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పశ్చిమ గోదావరి
పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత ఏజెన్సీలకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని, పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు నిమ్మల రామానాయుడు - జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే వెల్లడించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరిన ఆయన, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.