భక్తిశ్రద్ధలతో ముగిసిన గణనాథుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో గజదత్ యూత్ మరియు సూర్య సేన యూత్ ఆధ్వర్యంలో విగ్రహ దాత ఒగ్గు మమత మహేష్ దంపతులు విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గణనాథుని ఆశీస్సులతో మండల ప్రజలంతా సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.