ఎమ్మెస్టీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్: రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ఓట్ల లెక్కింపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠత రేకెత్తిస్తున్న ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శనివారం ఉదయం నుంచి పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు అన్ని జిల్లాల్లోనూ ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 కేంద్రాల్ లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇందుకు సంబంధించి అధికారులు 9,062 టేబుళ్లను సిద్ధం చేశారు. ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 39,694 మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. ముందుగా నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఒక్కో టేబుల్ పై సుమారు వెయ్యి బ్యాలెట్లను లెక్కించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.