మంచిర్యాలలో ఘన విజయంతో హోరెత్తిన ఆర్టీసీ కార్మికుల సంబరాలు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించిన సందర్భంగా మంచిర్యాలలో గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుంచి బస్ స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రతి ఒక్క కార్మికుడికి యూనియన్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.