అమీనాబాద్: పత్తి సాగులో పకడ్బందీ పద్ధతులు పాటించాలి సీపీఎఫ్
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
అమీనాబాద్‌లో ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పత్తి సాగులో సమర్థ నిర్వహణ, సహజ వనరుల సంరక్షణ, పంట రక్షణ, నాణ్యత పెంపుపై వివరించారు. ఐపీఎం పద్ధతులతో పురుగు, తెగుళ్ల నియంత్రణ, కోత అనంతర జాగ్రత్తలపై రైతులు, వ్యవసాయ కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు.