ఈ నెల 7న నెల్లూరు జిల్లాకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ నెల 7న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు యోగి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ట్రస్టు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యోగి రాకతో జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.