ఆసియా గేమ్స్ క్రికెట్ ఫైనల్స్ లోకి భారత మహిళల జట్టు ప్రవేశం

రిపోర్టర్: గోపి స్థలం: India

ఆసియా గేమ్స్ క్రికెట్లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో బంగ్లాదేశ్పై ఘన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 195 పరుగుల భారీ స్కోరు సాధించగా, ఓపెనర్ షఫాలీ వర్మ సెంచరీతో అదరగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 81 పరుగులకే ఆలౌట్ అయింది. సెప్టెంబర్ 22న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది.