టీచర్లకు అలర్ట్: ఏపీ స్పెషల్ టెట్ హాల్ టికెట్లు విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఏపీ ప్రత్యేక టెట్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.