అమరావతి భవనాల ప్రారంభోత్సవం: నవంబరు 11 తర్వాతేనని మంత్రి నారాయణ వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
రాజధాని అమరావతిలో నిర్మించిన భవనాలకు నవంబరు 11 తర్వాత ప్రారంభోత్సవం చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై శనివారం గుత్తేదారు సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2028 అక్టోబరు నాటికి రాజధాని నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి ఎన్నికలను పెండింగ్లో పెడుతున్నామని ఆయన వెల్లడించారు.