బెల్లంపల్లిలో లీకైన మంచినీటి పైప్లైన్.. ఆందోళనలో ప్రజలు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో డ్రైనేజీ పనులు చేస్తుండగా జేసీబీ తగలడంతో, 28వ వార్డు వాటర్ పైప్లైన్ లీకైంది. దీంతో పైప్లైన్లోకి డ్రైనేజీ మురికినీరు చేరుతుండటంతో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలే మంచినీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సమస్య తలెత్తింది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి దెబ్బతిన్న వాటర్ పైపును గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని 28వ వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.