యాదగిరిగుట్టలో ఘనంగా జరిగిన ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సదస్సు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
యాదగిరిగుట్టలో సోమవారం నాడు నిర్వహించిన ఉద్యమకారుల ఫోరం తొమ్మిదవ రాష్ట్ర ఆవిర్భావ సదస్సుకు రామన్నపేట మండల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిసి సదస్సును విజయవంతం చేశారు. అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని తమకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత న్యాయం చేయాలని ప్రత్యేకంగా వేడుకున్నారు.