దిల్లీలో బ్రిక్స్ సదస్సు: ప్రపంచ సంక్షేమమే లక్ష్యమన్న ప్రధాని మోదీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: దిల్లీ

దిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షిస్తూ సదస్సులో సానుకూల, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సద్గుణాలున్న వారితోనే కలిసి పనిచేయాలని, చర్చలు జరపాలని ఆయన పేర్కొన్నారు. సదస్సుకు వచ్చే పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.