అహ్మదాబాద్‌లో లవ్ లెటర్ రాశాడంటూ నాలుగో తరగతి బాలుడిపై ప్రిన్సిపాల్ దాడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అహ్మదాబాద్

అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో తోటి విద్యార్థినికి ఐ లవ్ యూ అని రాసిన చీటీని ఇచ్చినందుకు నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు బీతో కొట్టారు. ఇంటికి వెళ్లిన బాలుడు గదిలో ఏడ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు రామోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిత్ చౌదరి పాఠశాల నుంచి నివేదిక కోరారు.