ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు జరగనున్న శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి వారు అధికారిక ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.