'ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ పరమావధి': సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ప్రజా పాలనను అందిస్తున్నామని, పేదలు, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.