వైద్యుల హెచ్చరిక: గుండెపోటుగా పొరబడే ప్రాణాంతక షింగిల్స్ వ్యాధిపై క్లారిటీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి షింగిల్స్ వ్యాధి సోలే అవకాశం ఉందని క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్యం స్వామినాథన్ వెల్లడించారు. చిన్నతనంలో వచ్చిన చికెన్ పాక్స్ వైరస్ శరీరంలోనే ఉండి, రోగనిరోధక శక్తి తగ్గితే షింగిల్స్ గా మారుతుందని తెలిపారు. దీనివల్ల తీవ్రమైన నరాల నొప్పి, దద్దుర్లు వస్తాయని, ప్రారంభ దశలో దీనిని గుండెపోటుగా పొరబడే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.