సిడ్నీలో సల్వాటోర్ బాబోన్సతో సమావేశం: భారత ప్రజాస్వామ్యంపై ప్రత్యేక చర్చ
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రొఫెసర్ సల్వాటోర్ బాబోన్సను కలిసినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత ప్రజాస్వామ్యం, దాని పెరుగుతున్న ప్రపంచ స్థాయి ప్రాధాన్యతపై ఆ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. మన ప్రజల వేళ్లలో దృఢంగా నాటుకుపోయిన శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆయన రచనలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయని ఈ సందర్భంగా జి. కిషన్ రెడ్డి ప్రశంసించారు.