సెన్సార్ బోర్డు కొత్త మార్గదర్శకాలపై దర్శకుడు హనీ ట్రేహన్ ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
భావప్రకటన స్వేచ్ఛను అణచివేసేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కొత్త మార్గదర్శకాలు ఉన్నాయని దర్శకుడు హనీ ట్రేహన్ మండిపడ్డారు. ఈ నిబంధనలు నియంతృత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీటీలో విడుదలైన తన సట్లూజ్ సినిమా తొలగింపు వివాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నూతన నిబంధనలపై చిత్ర పరిశ్రమ వర్గాల్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.