దివ్యాంగ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Nuh
హర్యానా రాష్ట్రంలోని నూహ్ జిల్లాలో దివ్యాంగ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన రామ్ ప్రసాద్ అనే వ్యక్తికి ప్రత్యేక పోక్సో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు పోలీసులు వెల్లడించారు. అటవీ ప్రాంతానికి బాలుడిని తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలడంతో న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు నిందితుడికి ఇరవై వేల రూపాయల జరిమానా కూడా విధించింది.