పొదలకూరు అభివృద్ధికి కోట్లతో శ్రీకారం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పొదలకూరు

పొదలకూరులో కోటి అరవై లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.