ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన పలు కాలేజీల విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘన విజయం సాధించింది. అదితి మహావిద్యాలయ, శ్రీ అరబిందో కాలేజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజీ, భారతి కాలేజీ, శివాజీ కాలేజీల్లో ఏబీవీపీ అన్ని ప్రధాన స్థానాలను కైవసం చేసుకుంది. రామజస్ కాలేజీ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాలేజీ, కేశవ్ మహావిద్యాలయాల్లోనూ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మరోవైపు జాకిర్ హుస్సేన్, భాస్కరాచార్య కాలేజీల్లో ఎస్ఎఫ్ఐ కొన్ని స్థానాలను గెలుచుకుంది.