2029 ఎన్నికల ముందే 21 రాష్ట్రాల్లో యూసీసీ అమలు: అమిత్ షా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: மகாராஷ்டிரா

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి పౌరస్మృతిని (UCC) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ యూసీసీని కచ్చితంగా అమలులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.