బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన: కలకలం
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమ ప్రముఖుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని, ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, టైగర్ ష్రాఫ్ కుటుంబానికి తక్షణమే పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని FWICE ప్రతినిధులు డిమాండ్ చేశారు.