నిమ్మకూరు ఏపీఆర్జేసీలో జేఈఈ నీట్ అకాడమీ ఏర్పాటుకు నిర్ణయం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్జేసీలో జేఈఈ, నీట్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అకడమిక్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, రెసిడెన్షియల్ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్, ఏఐ శిక్షణ తప్పనిసరి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.