హనుమంతు అప్పయ్యదొర 13వ వర్ధంతి: ఘనంగా నివాళులు
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
పలాసలో దివంగత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్యదొర 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజలు నివాళులర్పించారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు.
న్యాయవాదిగా ప్రస్థానం మొదలుపెట్టి, సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీగా అప్పయ్యదొర ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొనియాడారు. ఉద్దానం ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు.