బ్రిటన్ పై ఇరాన్ ఉక్కుపాదం: ఎంఐ సిక్స్ శత్రువర్గంగా ప్రకటన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: టెహ్రాన్
బ్రిటన్ తో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ సిక్స్ తో పాటు రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్ లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులకు లండన్ ప్రభుత్వం అన్ని రకాల లాజిస్టిక్ మద్దతు ఇస్తోందని, తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించినందుకే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.