నర్సంపేటలో విద్యుత్ కోతలు.. ఐదు రోజులుగా చీకట్లోనే స్థానికులు
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేటలోని 12, 13వ వార్డుల్లో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కరెంట్ నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు చీకటితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, కరెంట్ కోతలకు గల కారణాలను వెల్లడించడంతో పాటు, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.