నీటి జాడ లేక నెర్రెలు బారిన వరి మడులు
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట డివిజన్లో వర్షాభావ పరిస్థితులతో పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో నీటి జాడ లేక ఎండిన నారు మడులు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పచ్చగా కనిపించాల్సిన పొలాలు వెలవెలబోతున్నాయి. వినాయక చవితి నాటికైనా వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది పంటలపై ఆశలు వదులుకోవాల్సి వస్తోందని స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.