ఇంజనీర్స్ డే వేళ ఇంజనీర్లకు అపూర్వ సన్మాన సత్కారం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో మంగళవారం ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హౌసింగ్ ఏఈ వివేకానంద, విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నమిలే మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొని వారి సేవలను కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు విద్యుత్ రంగంలో వారు అందిస్తున్న నిరంతర సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.