చరిత్రలో మరుగున పడిన వీరుడి కథతో రణబాలి: విజయ్ దేవరకొండ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
చరిత్రలో రహస్యంగా మిగిలిపోయిన యథార్థ సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని నిర్మించినట్లు కథానాయకుడు విజయ్ దేవరకొండ వెల్లడించారు. బ్రిటీష్ పాలనా కాలం నాటి దుర్భర పరిస్థితులు, అనంతపురం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించామని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.