తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబు తీరును తప్పుబట్టిన వైఎస్ జగన్

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

అర్నబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయకుండా కేవలం ప్రచారానికే చంద్రబాబు పరిమితమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. సీసీ కెమెరాలు, ఆర్టీజీఎస్తో పంట నష్టం తెలియదని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.