మూసీలో గుర్రపుడెక్క కలవరం.. దోమల మోతతో ప్రజలు అతలాకుతలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని బాపూఘాట్ వద్ద మూసీ నది గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో నిండి దోమల సంతానోత్పత్తి కేంద్రంగా మారింది. ఐదు కిలోమీటర్ల మేర నదిని కలుపు మొక్కలు కప్పేయడంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే చాలు తేనెటీగల మాదిరిగా దోమలు జనావాసాలపై దాడి చేస్తున్నాయని వాపోతున్నారు.