లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంవీఐ సస్పెండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కావలి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ గోపినాయక్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఆయనతో పాటు సహకరించిన ఇద్దరు హోంగార్డులను మాతృశాఖకు బదిలీ చేశారు. అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.